అధిక బ‌రువును త‌గ్గించే మిరియాల టీ..!


Tue,February 20, 2018 07:08 PM

మిరియాల‌ను మ‌నం వంట‌ల్లో అప్పుడ‌ప్పుడు ఉప‌యోగిస్తుంటాం. కారానికి ప్రత్యామ్నాయంగా కొంద‌రు మిరియాల‌ను వాడుతుంటారు కూడా. మిరియాల‌లో మ‌నకు ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్ర‌మంలో మిరియాలతో త‌యారు చేసే టీని తాగ‌డం వ‌ల్ల అధికంగా ఉన్న శ‌రీర బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక టీస్పూన్ మిరియాలు, 2 క‌ప్పుల నీరు, ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ అల్లం తురుంల‌ను తీసుకోవాలి. నీటిలో మిరియాలు, అల్లం తురుము వేసి బాగా మ‌రిగించాలి. అనంత‌రం నీళ్ల‌ను వ‌డ‌బోసి ఆ నీటిలో నిమ్మ‌ర‌సం, తేనె క‌లుపుకుని తాగాలి. దీంతో అధికంగా ఉన్నశ‌రీర‌ బ‌రువు త‌గ్గిపోతుంది. అయితే ఈ మిశ్ర‌మం కేవ‌లం బ‌రువుకే కాదు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ప‌నిచేస్తుంది.

ఆక‌లిని త‌గ్గించడంలో మిరియాల టీ బాగా ప‌నిచేస్తుంది. స్వీట్లు, అధిక క్యాల‌రీలు ఉన్న ఆహారం, టీ, కాఫీ, జ్యూస్‌ల‌కు బ‌దులుగా మిరియాల టీని తాగ‌వ‌చ్చు. దీంతో బ‌రువు త‌గ్గుతారు. మిరియాల టీతో మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. ర‌క్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను ఈ టీ త‌గ్గిస్తుంది. శ‌రీర రోగ నిరోధక వ్య‌వ‌స్థ పటిష్ట‌మ‌వుతుంది.

6015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles