నిద్ర తగ్గినా, పెరిగినా.. గుండె జబ్బుల రిస్క్ ఎక్కువే..!


Tue,December 25, 2018 11:09 AM

మీరు నిత్యం ఎన్ని గంటలు నిద్రపోతున్నారు ? వైద్యులు సూచిస్తున్న ప్రకారం వ్యక్తులు వారి వారి వయస్సును బట్టి నిత్యం 6 నుంచి 8 గంటల వరకు నిద్రించాలి. అలా కాకుంగా 6 గంటల కన్నా తక్కువగా నిద్రించినా, లేదా 8 గంటల కన్నా ఎక్కువగా నిద్రపోయినా గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని కెనడాకు చెందిన మెక్‌మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలియజేస్తున్నారు.

ప్రపంచంలోని 21 దేశాలకు చెందిన 35 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 1,16,632 మంది ఆరోగ్య వివరాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఇతర సమాచారం సేకరించిన సైంటిస్టులు పై విషయాన్ని చెబుతున్నారు. నిత్యం 6 గంటల కన్నా తక్కువగా నిద్రించే వారికి గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం 9 శాతం వరకు ఉంటుంది. ఇక 8 గంటల కన్నా ఎక్కువగా 10 గంటల లోపు నిత్యం నిద్రించే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 17 శాతం వరకు, 10 గంటల కన్నా ఎక్కువగా నిద్రించేవారికి ఆ అవకాశం 41 శాతం వరకు ఉంటుందట. కనుక నిత్యం ఎవరైనా కచ్చితంగా 6 నుంచి 8 గంటల పాటు నిద్రించాలని, దాంతోపాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు.

3431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles