హైబీపీ రాకుండా ఉండాలంటే..?


Sat,December 1, 2018 04:18 PM

ప్రపంచ వ్యాప్తంగా నేడు అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హైబీపీ కూడా ఒకటి. దీని బారిన పడి అనేక మంది గుండె జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు. హైబీపీతో సాధారణ జీవితం గడపలేకపోతున్నారు. ఎప్పుడు గుండె జబ్బు వస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అయితే హైబీపీ వచ్చే దాకా వేచి ఉండకుండా, అది రాకుండా ముందుగానే కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే హైబీపీ రాకుండా నియంత్రించవచ్చు. మరి అందుకు పాటించాల్సిన సూచనలను ఇప్పుడు తెలుసుకుందామా..!

1. నిత్యం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూడాలి. రోజుకు 5 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పును వాడరాదు. ఉప్పు ఎక్కువగా తింటే అందులో ఉండే సోడియం హైబీపీ వచ్చేందుకు కారణమవుతుంది.

2. ఫాస్ట్‌ఫుడ్స్ తినడం మానేయాలి. వీటిలో ఉప్పు అధిక మోతాదులో ఉంటుంది. అది మంచి కాదు.

3. కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం తగ్గించాలి. కొవ్వు పదార్థాలను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది హైబీపీకి దారి తీస్తుంది. కనుక ఆ పదార్థాలను తీసుకోవడం మానేయాలి.

4. పచ్చళ్లు, నూనెలో వేసి వేయించిన పదార్థాలను తినడం తగ్గించాలి.

5. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే పండ్లు, కూరగాయలు, నట్స్, ఆరోగ్యకరమైన నూనెలను వాడాలి. పప్పులు, తృణ ధాన్యాలను తీసుకుంటే హైబీపీ రాకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు నిత్యం వ్యాయామాలు, యోగా, ధ్యానం చేస్తే మరింత ఫలితం ఉంటుంది.

4352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles