కొవ్వు క‌ర‌గాలా..? వీటిని తీసుకోండి..!


Sat,February 24, 2018 04:53 PM

శ‌రీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల వ‌చ్చేది స్థూల‌కాయం. అంతే కాదు అధికంగా కొవ్వు ఉండడం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో శ‌రీరంలో ఉండే కొవ్వును క‌చ్చితంగా త‌గ్గించుకోవ‌డం అవ‌స‌రం. అయితే మ‌న ఇండ్ల‌లో ఉండే ప‌లు ప‌దార్థాల‌నే నిత్యం మ‌న ఆహారంలో త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును త‌గ్గించుకోవ‌చ్చు. ఆ ప‌దార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వెల్లుల్లి


ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వును కరిగించ‌డంలో వెల్లుల్లి బాగా ప‌నిచేస్తుంది. దీంట్లో ఆలిసిన్ అనే ర‌సాయ‌నం యాంటీ బాక్టీరియ‌ల్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది. దీంతో పాటు దేహంలో అధికంగా ఉన్న కొవ్వును కూడా క‌రిగిస్తుంది. నిత్యం 2 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ప‌చ్చిగా అలాగే తింటే ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. శ‌ర‌రీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

2. తేనె


రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. ఈ మిశ్ర‌మంలో కొవ్వును క‌రిగించే గుణాలు మెండుగా ఉన్నాయి. దీంతో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది.

3. ట‌మాటా


ట‌మాటాల‌లో క్యాన్స‌ర్ కార‌కాల‌ను నిర్వీర్యం చేసే గుణం ఉంది. అలాగే కొవ్వును క‌రిగించే గుణం కూడా ఉంది. వంట‌కాలలో ట‌మాటాను విరివిగా వాడితే ఎంతో లాభం క‌లుగుతుంది. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున రెండు ట‌మాటాల‌ను తిన్నా లేదంటే వాటి జ్యూస్‌ను తాగినా ఫ‌లితం ఉంటుంది.

4. గ్రీన్ టీ


రోజు గ్రీన్ టీ తాగ‌డం ఎంతో మంచిది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు కొవ్వును క‌రిగించే ల‌క్ష‌ణం కూడా మెండుగా ఉంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

5. క్యాబేజీ


శ‌రీరంలో అధికంగా పేరుకు పోయిన కొవ్వును క‌రిగించడంలో క్యాబేజీ కూడా బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో క్యాల‌రీలు బాగా త‌క్కువ‌గా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు.

6. ఓట్స్‌


ఓట్స్‌లో పీచు ప‌దార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అంతేకాదు కొవ్వును క‌రిగించే ఔష‌ధ గుణాలు కూడా ఓట్స్‌లో ఉన్నాయి. నిత్యం ఓట్స్‌ను తింటుంటే శరీరంలో అధికంగా ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

10755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles