మెదడు చురుగ్గా పనిచేయాలంటే వీటిని తీసుకోవాలి..!


Sat,February 10, 2018 01:53 PM

నేటి ఉరుకుల పరుగుల బిజీ ప్రపంచంలో పోటీతనం ఎక్కువైంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం... ఇలా ఏ రంగం తీసుకున్నా వ్యక్తుల మధ్య పోటీ అనివార్యమైంది. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే వారైతే ఇంకా పట్టుదలతో శ్రమిస్తున్నారు కూడా. ఈ క్రమంలో ఏ వ్యక్తి అయినా మరింత చురుగ్గా ముందుకు దూసుకుపోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండడంతోపాటు మానసికంగా దృఢంగా ఉండాలి. అలా ఉండాలంటే మెదడు చురుగ్గా పనిచేయాలి. అలా చేయాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పౌష్టికాహారం కూడా అవసరం. ఈ నేపథ్యంలో మెదడు చురుకుదనాన్ని పెంచే పలు రకాల ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో మెద‌డు చురుగ్గా ప‌నిచేయ‌డ‌మే కాదు, జ్ఞాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంది. ఫ‌లితంగా మాన‌సికంగా దృఢంగా ఉండ‌వ‌చ్చు.

యాపిల్స్


రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు. అయితే రోజుకో యాపిల్‌ను తింటే మెదడు చురుకుదనం కూడా పెరుగుతుంది. ఎందుకంటే యాపిల్స్‌లో క్వర్సెటిన్ అనే ఓ ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మెదడు కణాలు నాశనం కాకుండా చూస్తుంది. దీంతోపాటు నాడీ కణాలకు అవసరమైన శక్తిని కూడా ఇస్తుంది.

పాలకూర


దీంట్లో విటమిన్ కె, ఫోలేట్‌లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి మెదడును చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంతోపాటు పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయి.

ఆలివ్ ఆయిల్


ఆలివ్ ఆయిల్ కేవలం గుండెకే కాదు, మెదడుకు కూడా మంచిదే. దీంట్లో ఉండే ఓలియోకెంథాల్ అనే రసాయనం మతిమరుపు వంటి సమస్యలను తొలగిస్తుంది. అంతేకాదు మెదడు కణాలు ఉత్తేజంగా పనిచేసేలా చూస్తుంది.

పసుపు


పసుపులో యాంటీ డిప్రెస్సెంట్లుగా పనిచేసే పలు ఔషధాలు దాగి ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు కణాలు నాశనం కాకుండా చూస్తాయి. మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి.

దాల్చినచెక్క


దాల్చినచెక్కలో ఉండే ఔషధ కారకాలు మెదడు కణాల చురుకుదనానికి తోడ్పడుతాయి. దీంతో జ్ఞాపకశక్తి పెరగడమే కాదు, మెదడు కూడా వేగంగా పనిచేస్తుంది. మెదడులోని కణాల వినాశనాన్ని అడ్డుకునే శక్తి దాల్చినచెక్కకు ఉంది.

7000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles