వాము ఆకుల‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు..!


Thu,March 7, 2019 02:57 PM

భారతీయులు వాడే అనేక ర‌కాల వంటి ఇంటి పోపు దినుసుల్లో వాము గింజ‌లు కూడా ఒక‌టి. వీటిని అనేక ర‌కాల పానీయాలు త‌యారీలో వేస్తుంటారు. అలాగే ప‌లు వంట‌కాల్లోనూ వామును ఎక్కువ‌గా వినియోగిస్తారు. వాము చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. అలాగే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా వాము అందిస్తుంది. అయితే వాము మాత్ర‌మే కాదు, వాము మొక్క ఆకులు కూడా మ‌న‌కు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొన్ని వాము ఆకులు తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ముందుగా క‌డిగి పెట్టుకున్న వాము ఆకుల‌ను వేసి బాగా మ‌రిగించి డికాష‌న్ త‌యారుచేసుకోవాలి. అందులో కొద్దిగా తేనె వేసి వేడిగా ఉండ‌గానే తాగాలి. దీని వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం త‌గ్గుతాయి.

2. వాము ఆకుల‌తో త‌యారు చేసిన డికాషన్ ను తాగితే జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా అజీర్తి త‌గ్గుతుంది.

3. డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాము ఆకుల డికాష‌న్ రోజూ తాగితే ఫ‌లితం ఉంటుంది.

4. కొన్ని వాము ఆకుల‌ను తీసుకుని బాగా న‌లిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ పోతుంది. వికారంగా ఉన్నా ఇలా చేస్తే ఆ స‌మస్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. వాము ఆకుల డికాష‌న్ తాగ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి, మానసిక ప్ర‌శాంత‌త క‌లుగుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది.

5804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles