కీళ్ల నొప్పులను పోగొట్టే ఎఫెక్టివ్ టిప్స్‌..!


Fri,December 15, 2017 02:08 PM

సాధారణంగా వయస్సు పైబడిన వారిలో కీళ్ల నొప్పులు రావడం సహజం. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు అరుగుదలకు గురై డోలుగా మారుతాయి. ప్రధానంగా కీళ్లలో ఈ సమస్య మరింతగా బాధిస్తుంది. అయితే నేటి తరుణంలో మధ్య వయస్సు వారికి కూడా ఈ నొప్పులు వ‌స్తున్నాయి. దీంతో వీటి నుంచి పూర్తిగా బయటపడాలంటే తరచూ మందులు వాడాల్సి రావడమో, ఆపరేషన్ అవసరం కావడమో జరుగుతున్న‌ది. అయితే కీళ్ల నొప్పుల నుంచి కొంత ఉపశమనం పొందాలంటే కింద పేర్కొన్న పలు సూచనలు పాటిస్తే దాంతో మంచి ఫలితాలు పొంద‌వ‌చ్చు. స‌మ‌స్య నుంచి బ‌యట ప‌డేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నొప్పులున్న చోట యూకలిప్టస్ ఆయిల్ రాసి వేడి నీటితో కాపడం పెట్టాలి. లేదంటే మెత్తటి టవల్‌ను వేడి నీటిలో ముంచి దాన్ని బాగా పిండి అనంతరం నొప్పులున్న చోట ఉంచాలి.

2. విటమిన్ సి అధికంగా ఉండే జామ, నారింజ, నిమ్మ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, దాని సంబంధిత ఉత్పత్తులను వాడకూడదు.

3. ఉప్పు కలిపిన నీటిలో చింత చిగురును ఉడికించి నొప్పులున్న చోట ఆ నీటిని పోస్తే ఫలితం ఉంటుంది. క్యారెట్ జ్యూస్, క్యాబేజ్ సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

4. నువ్వుల నూనె, నిమ్మ రసం సమభాగాలుగా తీసుకుని వాటిని బాగా కలిపి కీళ్లపై మర్దనా చేస్తే కీళ్లవాతం తగ్గి క్రమంగా నొప్పులు కూడా తగ్గుతాయి.

5. వావిలి చెట్టు వేర్ల చూర్ణం ఒక గ్రాము, 2 గ్రాముల నువ్వుల నూనెలో కలిపి రోజుకు రెండు సార్లు తింటే కీళ్లవాతం, నడుము నొప్పి కూడా తగ్గుతాయి.

6. ఒమెగా-3 ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, నట్స్‌ను తినడం మంచిది. వీటితోపాటు బ్లూబెర్రీలు, కెల్ప్, హార్స్ రాడిష్, వెల్లుల్లి వంటి పదార్థాలను తినాలి.

8151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles