యాప్రికాట్స్‌తో రక్తహీనత సమస్యకు చెక్‌..!


Wed,April 10, 2019 12:38 PM

యాప్రికాట్స్‌ మనకు రెండు రూపాల్లో లభిస్తాయి. పండ్లుగా, డ్రై ఫ్రూట్స్‌గా ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి తియ్యని, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. డ్రై యాప్రికాట్స్‌ మనకు ఏ సీజన్‌లో అయినా లభిస్తాయి. వీటిని నిత్యం తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాప్రికాట్స్‌లో విటమిన్‌ ఎ, సి, కె, ఇ, పొటాషియం, కాపర్‌, మాంగనీస్‌, మెగ్నిషియం, పాస్ఫరస్‌, నియాసిన్‌ తదితర పోషకాలు ఉంటాయి. వీటి వల్ల మనకు సంపూర్ణ పోషణ అందుతుంది.

2. యాప్రికాట్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. బరువు తగ్గుతారు.

3. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు యాప్రికాట్లను తింటే ఫలితం ఉంటుంది.

4. మలబద్దకం సమస్య ఉన్నవారు రోజూ రాత్రి పూట యాప్రికాట్లను తింటుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

5. యాప్రికాట్లలో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

6. రక్తహీనత సమస్య ఉన్నవారు యాప్రికాట్లను తింటే రక్తం బాగా ఉత్పత్తి అవుతుంది.

1578

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles