రోజూ ఉద‌యాన్నే వాము నీటిని తాగితే..?


Thu,November 30, 2017 01:12 PM

వామును త‌ర‌చూ మ‌నం అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటాం. ఇది కొంచెం ఘాటుగా, కారంగా, వ‌గ‌రుగా ఉంటుంది. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే రుచికే కాదు, ఔష‌ధ గుణాల్లోనూ వాము మేటిగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని ప‌లు ఆయుర్వేద మందుల్లోనూ వాడుతారు. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ఒక గ్లాస్ వాము నీటిని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు టీ స్పూన్ల వాముని దోరగా వేయించి, దాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉద‌యాన్నే వామును అలాగే అదే నీటిలో మ‌రిగించాలి. అనంత‌రం వామును వ‌డ‌గ‌ట్ట‌గా వ‌చ్చే నీటిని గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. దీంతో కింద చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

1. పైన చెప్పిన విధంగా వాము నీటిని త‌యారు చేసుకుని రోజూ తాగితే కిడ్నీలు, మూత్రాశ‌యంలో ఉండే రాళ్లు క‌రిగిపోతాయి. అయితే ఈ నీటిలో వెనిగ‌ర్ లేదా తేనె క‌లిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మ‌రింత ఎఫెక్టివ్‌గా ఈ ఔష‌ధం ప‌నిచేస్తుంది.

2. ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. జీర్ణాశ‌య స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. మ‌లబ‌ద్ద‌కం పోతుంది.

4. ఊపిరితిత్తుల్లో చేరిన క‌ఫం పోతుంది. ఊపిరితిత్తులు శుభ్ర‌మ‌వుతాయి.

5. గ‌ర్భిణీల్లో త‌లెత్తే మ‌ల‌బ‌ద్ద‌కం, కడుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌లు పోతాయి. బాలింత‌ల్లో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి.

6. కీళ్ల నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. శ‌రీరం తేలిక‌వుతుంది. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

7. శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు.

8. బ్ల‌డ్ షుగ‌ర్ త‌గ్గుతుంది. మ‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తుంది.

10495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles