శృంగార సామర్థ్యాన్ని పెంచే మునగకాయలతో ఎన్నో లాభాలు..!

Wed,November 29, 2017 02:25 PM

మనం తరచూ తినే కూరగాయల్లో మునగకాయలు కూడా ఒకటి. వీటితో కూర లేదా చారు ఎలా చేసుకుని తిన్నా వీటి టేస్ట్ అమోఘంగా ఉంటుంది. అయితే రుచికే కాదు, మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ మునగకాయలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే తరచూ మునగకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. మునగకాయల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో వారు శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు. వీర్యం వృద్ధి చెందుతుంది. శుక్ర కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

2. మునగకాయల్లో ఉండే పోషకాలు గాల్ బ్లాడర్ పనితీరును మెరుగు పరుస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇది మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. తరచూ మునగకాయలను తీసుకుంటే మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.

3. బి విటమిన్లు అయిన నియాసిన్, రైబోఫ్లేవిన్, విటమిన్ 12 వంటివి మునగకాయల్లో పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల ఇవి జీర్ణ సమస్యలను పోగొడతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తాయి.

4. ఎముకల పెరుగుదల, దృఢత్వానికి అవసరం అయ్యే ఐరన్, కాల్షియంలు మునగకాయల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను పటిష్టంగా మారుస్తాయి. ప్రధానంగా మహిళలు, పిల్లలకు ఇవి ఎంతగానో అవసరం.
drumsticks
5. మునగకాయలను తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది.

6. మునగకాయల్లో ఉండే విటమిన్ సి శ్వాసకోశ సమస్యల నుంచి బయట పడేస్తుంది. అలర్జీల నుంచి రక్షిస్తుంది. దగ్గు, జలుబు వంటివి తగ్గిపోతాయి.

7. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

8. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.

7513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles