లెమ‌న్‌గ్రాస్ టీ తాగితే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Mon,April 15, 2019 07:33 PM

మ‌న దేశంతోపాటు ప‌లు ఆసియా దేశాల్లోనూ లెమ‌న్ గ్రాస్ మొక్క బాగా పెరుగుతుంది. ఈ మొక్క ఆకుల్లో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉంటాయి. లెమ‌న్‌గ్రాస్ ఆకుల్లో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఈ ఆకులు ఔష‌ధంగా ప‌నిచేస్తాయి. అయితే లెమన్‌గ్రాస్ ఆకుల నుంచి త‌యారుచేసే టీని నిత్యం తాగ‌డం వల్ల కూడా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. లెమ‌న్‌గ్రాస్ ఆకుల టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం త‌గ్గుతాయి. త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి.

2. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఇన్‌ఫెక్ష‌న్లు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి.

3. కిడ్నీ స‌మ‌స్య‌లు పోతాయి. మూత్రాశ‌యం నుంచి మూత్రం సాఫీగా వ‌స్తుంది. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

4. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. డ‌యాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

5. అధిక బ‌రువు త‌గ్గుతారు. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి.

3214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles