రోగానికి కాదు.. రోగికి చికిత్స..

Wed,January 1, 2020 08:53 AM

హైదరాబాద్‌: సాధారణంగా మనిషికి ఏదైన అనారోగ్యం వచ్చిందంటే వెంటనే వైద్యున్ని సంప్రదిస్తాం. జలుబు, జ్వరం వస్తే అది తగ్గడానికి, కిడ్నీలో రాళ్లు వస్తే అవి కరిగిపోవడానికి లేదా వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం మనం చూస్తున్న వైద్య పద్ధతులు. కానీ హోమియో వైద్యంలో రోగానికి కాదు రోగికి చికిత్స చేస్తమంటున్నారు హోమియా వైద్యులు. అదేంటి రోగం వచ్చిన వారినే రోగి అంటారు కదా అంటే అక్కడే ఉంది అసలు ట్విస్ట్‌ అంటున్నారు రామంతాపూర్‌ హోమియో వైద్యకళాశాల నిపుణుడు డా.నోమియా.


రోగానికి మందు ఇవ్వడం తాత్కాలిక ఉపశమనం

ఏదైన జబ్బు చేసినప్పుడు వెంటనే దాన్ని తగ్గించడం రోగికి తాత్కాలిక ఉపశమనం కలిగించడమేనని హోమియో వైద్యులు అంటున్నారు. హోమియో వైద్య విధానంలో వ్యాధికి కాకుండా సదరు వ్యాధి రావడానికి గల కారణాలను విశ్లేషించడం జరుగుతుందని డా.నోమియా వివరించారు. వ్యాధితో పాటు దాని మూలాలను వెలికితీయడం హోమి యో ప్రత్యేకతగా ఆయన అభివర్ణించారు. భారతీ య సంప్రదాయ వైద్య విధానాల్లో ఒకటైన అయుష్‌లోని హోమియో వైద్యవిధానానికి ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యంగా ఇది దీర్ఘకాలిక వ్యాధులకు మంచి చికిత్స అందిస్తుందన్నారు.

సారుప్య సిద్ధాంతం ప్రకారం చికిత్స

హోమియో వైద్యవిధానం సారుప్య సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుందని, ఈ విధానంలో వ్యాధి రావడానికి ఎంత సమయం పడుతుందో అది నయం కావడానికి కూడా అంతే సమయం పడుతుందనేది సారుప్య సిద్ధాంతం పరమార్ధంగా డా.నోమియా వివరించారు. సాధారణంగా ఏ వ్యాధి కూడా మనిషికి వెంటనే అటాక్‌ కాదన్నారు. వ్యాధి సోకడానికి ముందు శరీరంలో కొన్ని రకాల ప్రక్రియలు జరుగుతాయని, దశలవారీగా వ్యాధి కారకం రూపాంతరం చెంది ఒక వ్యాధిగా మారుతుందని ఆయన వివరించారు. హోమియోలో ఒక రోగికి వచ్చిన వ్యాధిపై పూర్తి విశ్లేషణ(క్లీనికల్‌ స్టడీ)చేస్తామన్నారు. అదే సమయంలో రోగి మానసిక స్థితిపై కూడా విశ్లేషణ జరుగుతుందన్నారు. రోగి మానసిక స్థితిపై స్టడీ చేయకుండా కేవలం వ్యాధికి మాత్రమే ట్రీట్‌మెంట్‌ ఇస్తే అది అసంపూర్తి చికిత్సగా మారుతుందన్నారు.

శరీరంలో నుంచి రోగంతోపాటు అతని మెదడులో నుంచి రోగముందనే ఆలోచనను సైతం తొలగిస్తే సదరు వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా మారుతాడన్నారు. ఈక్రమంలో నే వ్యాధి రావడానికి జరిగిన ప్రక్రియలను తెలుసుకుని దానికి గల మూలకారణాన్ని గుర్తించి, వ్యాధి కుంభస్థలాన్ని పెకిలించడం జరుగుతుందని ఈ క్రమంలో ఇతర వైద్య పద్ధతుల్లో కంటే హోమియోలో వ్యాధులు నయంకావడానికి కొంత సమ యం పడుతుందని డా.నోమియా వివరించారు.

2159
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles