టీవీ ఎక్కువగా చూస్తూ స్నాక్స్‌ తినేవారు.. జాగ్రత్త..!


Tue,April 9, 2019 10:56 AM

టీవీ ఎదుట కూర్చుని గంటల తరబడి అదే పనిగా స్నాక్స్‌ లాగించేస్తున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే అలా టీవీ చూస్తూ స్నాక్స్‌ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇది మేం చెబుతున్నది కాదు.. సైంటిస్టుల పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

బ్రెజిల్‌కు చెందిన పలువురు సైంటిస్టులు అక్కడ నివాసం ఉండే 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి.. తదితర సమాచారాన్నంతా సేకరించి విశ్లేషించారు. దీంతో తేలిందేమిటంటే... నిత్యం 6 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారిలో కొందరికి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించారు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు త్వరగా వస్తాయని సైంటిస్టులు తేల్చారు. కనుక టీవీ ఎక్కువగా చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారు ఆ అలవాటును మానుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.

2141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles