విట‌మిన్ డి మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మంటే..?


Sun,February 3, 2019 01:17 PM

అన్ని విట‌మిన్ల లాగే మన శ‌రీరానికి విట‌మిన్ డి కూడా చాలా ముఖ్య‌మే. పిల్ల‌ల‌కే కాదు పెద్ద‌ల‌కు కూడా విట‌మిన్ డి అవ‌స‌ర‌మే. ఈ విట‌మిన్ లోపిస్తే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుక‌ని విట‌మిన్ డి ఉన్న ఆహారాల‌ను మ‌నం నిత్యం తీసుకోవాల్సిందే. విట‌మిన్ డి మ‌న శ‌రీరం కాల్షియంను శోషించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతోపాటు ఎముక‌లను దృఢంగా ఉంచుతుంది. విట‌మిన్ డి లోపిస్తే ఎముక‌లు బ‌ల‌హీన‌మై పెలుసుబారిపోతాయి. అలాగే కీళ్లు, కండ‌రాల నొప్పులు వ‌స్తాయి. నిత్యం ఉదయాన్నే కొంత స‌మ‌యం పాటు ఎండ‌లో నిలుచుంటే చాలు మ‌న‌కు విట‌మిన్ డి అందుతుంది. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ప‌లు వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. విట‌మిన్ డి చ‌ర్మానికి, వెంట్రుక‌ల ఆరోగ్యానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే ప్ర‌తి ఒక్క‌రు నిత్యం విట‌మిన్ డి ఉన్న ఆహారాల‌ను తీసుకోవాలి.

విట‌మిన్ డి ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. జీర్ణ‌స‌మ‌స్య‌లు పోతాయి. క్యాన్స‌ర్ రాకుండా ఉంటుంది. అధిక బ‌రువు తగ్గుతారు. అందుక‌ని విట‌మిన్ డి ఉన్న ఆహారాల‌ను రోజూ క‌చ్చితంగా తీసుకోవాల‌ని వైద్యులు కూడా చెబుతున్నారు. మ‌న‌కు విట‌మిన్ డి చేప‌లు, చీజ్‌, కోడిగుడ్డ ప‌చ్చ సొన‌, పాలు, న‌ట్స్‌, సీడ్స్‌, సోయా ప్రొడ‌క్ట్స్‌ల‌లో పుష్క‌లంగా ల‌భిస్తుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే విట‌మిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. అలాగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

9455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles