మెగ్నిషియంతో నిద్రలేమి సమస్య దూరం..!


Tue,June 4, 2019 06:07 PM

మన శరీరానికి కావల్సిన అనేక పోషకాల్లో మెగ్నిషియం కూడా ఒకటి. మన శరీరంలో మెగ్నిషియం లోపిస్తే వచ్చే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. మెగ్నిషియం మన శరీరంలో కండరాలు, నాడుల పనితీరుకు ఉపయోగపడుతుంది. మెగ్నిషియం లోపిస్తే రాత్రిపూట నిద్రలో కాలి పిక్కలు పట్టేస్తాయి. దాంతోపాటు నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు నిత్యం మెగ్నిషియం ఉన్న ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

నిత్యం మగవారికైతే 400 నుంచి 420 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం అవుతుంది. అదే స్త్రీలకు నిత్యం 310 నుంచి 320 మిల్లీగ్రాముల మెగ్నిషియం చాలు. ఈ క్రమంలో మనం తృణ ధాన్యాలు, పాలు, పెరుగు, ఆకుపచ్చని కూరగాయలు, పప్పు దినుసులు, నట్స్ నిత్యం తినడం వల్ల మెగ్నిషియం లభిస్తుంది. దాంతో నిద్రలేమితోపాటు పలు ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి. కనుక నిద్రలేమి ఉన్నవారు మెగ్నిషియం ఉన్న ఆహారాలను రోజూ తినాల్సిందే..!

3944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles