బంతి కోసం వెళ్లగా విద్యుత్ షాక్

Tue,September 17, 2019 06:21 AM

హైదరాబాద్ : క్రికెట్ బాల్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పడగా.. తీసుకురావడానికి వెళ్లిన యువకుడు విద్యుత్‌షాక్‌కు గురై తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ క్రీడా మైదానంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు యువకులు క్రికెట్ ఆడుతున్నారు. బాల్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పడగా.. తీసుకురావడానికి బ్యాంక్ కాలనీకి చెందిన తులసీరెడ్డి వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఆ బాలుడు ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108లో సురారంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడు.

1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles