చూడండి.. గులాబీ రంగులో కోడిగుడ్లు

Tue,August 22, 2017 03:48 PM

హైదరాబాద్ : సాధారణంగా కోడిగుడ్డు తెలుపు రంగులో ఉంటుంది. నాటు కోడి పెట్టిన గుడ్డు అయితే కొంచెం గోధుమ రంగులో ఉంటుంది. మరి ఈ కోడి అయితే వింతగా గులాబీ రంగులో కోడి గుడ్లను పెట్టింది. హయత్ నగర్ శుభోదయ నగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈ వింత వెలుగు చూసింది. శ్రీనివాస్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కొమురెల్లి మల్లన్న ఆలయం వద్ద ఓ కోడిని కొన్నాడు. అయితే ఆ కోడి గులాబీ రంగులో కోడిగుడ్లను పెట్టింది. ఈ విషయం.. ఆ నోట.. ఈ నోట.. కాలనీ మొత్తం వ్యాపించింది. దీంతో గులాబీ రంగు కోడిగుడ్లను చూసేందుకు జనాలు భారీగా క్యూకడుతున్నారు.

4106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles