ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Sat,November 9, 2019 07:18 AM

మేడ్చల్ కలెక్టరేట్: గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వివిధ వృత్తుల్లో ఉచిత శిక్షణ కల్పిస్తుందని జిల్లా యువజన, క్రీడల అధికారి బి. బలరామారావు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ పేరు, కాల పరిమితి, విద్యార్హతలు WWW.GSDP-ENVIS.GOV.IN, DEFAULT3.ASPX వెబ్ సైట్ ద్వారా తెలుసుకొని [email protected] మెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.


నియమ నిబంధనలు : 1.శిక్షణ, భోజనం మరియు ఉచితంగా వసతి. 2. దరఖాస్తు చేయువారు క్షుణంగా పరిశీలించి అర్హత కలిగిన వారే దరఖాస్తు చేసుకోవాలి. 3. ఎలాంటి టీఎ, డీఎలు ఇవ్వబడవు.4. ఇంటర్వ్యూకి వచ్చేవారు తప్పనిసరిగా 10వ తరగతి నుంచి డిగ్రీ సర్టిఫికెట్లు ఒరిజినల్ మరియు జిరాక్స్ పత్రాలు, కలర్ పాస్ ఫొట్, ఆధార్ కార్డుతో రావాలి. 5. శిక్షణ పూర్తయిన తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్థచే సర్టిఫికెట్లు ఇవ్వబడును. వివరాలకు ఫోన్ నంబర్ 040-67567511, 67567553, 67567521లను సంప్రదించాలని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

1210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles