బైరెడ్‌లో ఉచిత ఉపాధి కోర్సులకు ఆహ్వానం

Sat,November 2, 2019 06:38 AM

హైదరాబాద్ : నిరుద్యోగ యువకులకు ఉచితంగా ఉపాధి కోర్సులు రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ ఔత్సాహికుల అభివృద్ధి సంస్థలో ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నట్లు బైరెడ్ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. 40 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణా కార్యక్రమానికి 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మొబైల్ సర్వీసింగ్‌లో శిక్షణకు పదవ తరగతి పాస్, ఎంఎస్ ఆఫీస్‌లో శిక్షణ పొందేందుకు ఇంటర్మిడియట్ పాస్, అకౌంటింగ్ ప్యాకేజి, జీఎస్‌టీలో శిక్షణకు బీకాం పాస్ అయి ఉండాలన్నారు. ఈ శిక్షణా కాలంలో వసతి, భోజనం ఉచితంగా కల్పించబడుతుందన్నారు.


ఆసక్తి గల యువకులు సంస్థ వెబ్‌సైట్ www.bired.orgలో ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు అందిన వెంటనే అభ్యర్థులను ఫోన్ ద్వారా సంప్రదించి వారి అర్హతలకు తగ్గ ప్రవేశ సూచనలు ఇవ్వబడుతాయన్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 5వ తేదీ వరకు ముగియనున్నట్లు తెలిపారు. అడ్మిషన్లు పొందిన అభ్యర్థులు ఈనెల 18వ తేదీన ఉదయం 9గంటలకు రాజేంద్రనగర్‌లోని సంస్థ ఆవరణలో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు విద్యార్హతకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌లు, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఐదు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలన్నారు.

1064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles