నిజాయితీని చాటుకున్న ఆటోడ్రైవర్

Sat,October 19, 2019 06:33 AM

హైదరాబాద్ : ప్రయాణికులు ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను తిరిగి అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు ఓ ఆటో డ్రైవర్. ఈ సంఘటన హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం... కడప జిల్లా చిన్నచౌక్ భాగ్యనగర్ కాలనీకి చెందిన ఎం.అన్నయ్యశెట్టి (60) శుక్రవారం మధ్యాహ్నం లంగర్‌హౌస్ నుంచి మెహిదీపట్నం వరకు ఆటోలో ప్రయాణించారు. అనంతరం మెహిదీపట్నంలో ఆటో దిగేటప్పుడు బ్యాగు మర్చిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మెహిదీపట్నంలో ఉన్న ఆసిఫ్‌నగర్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆటోలో బ్యాగు ఉన్న విషయాన్ని గమనించిన ఆటోడ్రైవర్ దీపక్ హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బ్యాగును పోలీసులకు అప్పగించారు. అనంతరం అన్నయ్య శెట్టిని పిలిపించి బ్యాగును ఇన్‌స్పెక్టర్ కోరని సూనిల్, ఎస్‌ఐ సత్యనారాయణ అందజేశారు. ఆటో డ్రైవర్ దీపక్ నిజాయితీని పోలీసులు అభినందించారు.

1593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles