బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడంపై నిషేధం

Fri,November 2, 2018 01:45 PM

హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకుని రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడంపై నగర పోలీసులు నిషేధం విధించారు. దీపావళికి పటాకుల కాల్చివేతపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ఆదేశాలను అనుసరించి పోలీసులు ఉత్తర్వులను జారీచేశారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చుకోవాలన్నారు. అదికూడా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఆదేశాల ప్రకారమన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెలువరించిన నియమాలను అతిక్రమించి క్రాకర్స్, డ్రమ్స్ ఇతర పటాకులు పేల్చడం ద్వారా శబ్ధాలు చేయవద్దని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు నవబంర్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.1504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles