జీహెచ్‌ఎంసీలో సంబురాలు

Mon,February 11, 2019 01:55 PM

celebrations in GHMC

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ పాలకమండలి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహముద్‌ అలీ, మాజీ మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాం. హైదరాబాద్‌కు స్వచ్ఛ సర్వేక్షన్‌లో అవార్డు రావడం ఎంతో సంతోషకరం. - హోంమంత్రి మహముద్‌ అలీ

మూడేళ్లలో జీహెచ్‌ఎంసీ పాలక మండలి బాగా పని చేసింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్‌ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. మారుమూల బస్తీల్లో కొన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. - నాయిని నర్సింహారెడ్డి

గతంలో జీహెచ్‌ఎంసీకి చెడ్డ పేరుంది. ప్రస్తుతం ప్రణాళికబద్ధంగా పని చేస్తోంది. హైదరాబాద్‌ దేశానికి తలమానికంగా ఉండాలి. నగరాభివృద్ధికి ప్రతివారం అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ సమావేశాలు ఏర్పాటు చేయాలి. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల సహకారం ఉంటుంది. -తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

దేశంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అభివృద్ధి పనుల్లో ఎన్నో అవార్డులను జీహెచ్‌ఎంసీ అందుకుంటుంది. అధికారులు పని చేసేలా సహకరించే ప్రభుత్వం తెలంగాణలో ఉంది. - దాన కిశోర్‌

1722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles