బస్తీ దవాఖానల్లోనూ సీజనల్ వ్యాధులకు చికిత్స

Mon,September 2, 2019 07:07 AM

హైదరాబాద్‌: వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా ప్రబలుతున్న సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు బస్తీ దవాఖానల్లో సైతం ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా మలేరియా అధికారి రాంబాబు తెలిపారు. రం గారెడ్డి జిల్లా పరిధిలో 20 బస్తీ దవాఖానలను కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి బస్తీ దవాఖానలో సీజనల్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన చికిత్స అందించడంతోపాటు మలేరియా, డెంగ్యూ, టైఫైయిడ్, వైరల్‌ఫీవర్ వంటి వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాంబాబు వివరించారు.


రంగారెడ్డి జిల్లా పరిధిలో జూన్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 92 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వివరించారు. గత సంత్సరం ఇదే మూడు నెలల్లో 132 కేసులు నమోదయ్యాయని, గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు తక్కువగానే ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రైవేటు దవాఖానల్లో కేవలం డే-వన్ పరీక్షలు నిర్వహించి డెంగ్యూ వ్యాధిగా నిర్ధారిస్తున్నారని అది సరైన పరీక్ష కాదన్నారు. మ్యాకలిజా పరీక్ష ద్వారానే డెంగ్యూ వ్యాధి నిర్ధారణ జరుగుతుందని అది కేవలం ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుందన్నారు. వైరల్ ఫీవర్ తదితర సమస్యలతో బాధపడుతున్న రోగులు కచ్చితంగా జ్వరం నియంత్రించేందుకు తడిబట్టతో రోగి ఒంటిని తుడవడం, ప్రతి ఆరు గంటలకు ఒకటి పారసిటమాల్ లేదా డోలో 650 మాత్రను తీసుకోవాలని సూచించారు.

298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles