డిసెంబర్ 9 చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు

Mon,December 10, 2018 08:51 AM

హైదరాబాద్: డిసెంబర్ తొమ్మిదిని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని భారత జాతీయ లోక్‌దళ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పుల్లూరి వెంకటరాజేశ్వర్‌రావు అన్నారు. గులాబీ దళపతి కఠోర దీక్షకు కేంద్రం దిగివచ్చి తెలంగాణను ప్రకటించిన రోజని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు బషీర్‌బాగ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మలిదశ ఉద్యమవీరుడు కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని చూసి యావత్ ప్రపంచం గర్వించిన రోజని, డిసెంబర్ 9ని తెలంగాణ ప్రజలు ఎన్నడూ మరువరని ఆయన అన్నారు. తన ప్రాణాలను అడ్డు పెట్టి తెలంగాణ సాధించారన్నారు. మళ్లీ తెలంగాణకు కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించాలని ఆయన హితవు
పలికారు.

2664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles