తక్షణమే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం

Tue,August 20, 2019 10:16 PM

Etela Rajender Meeting With Telangana Aarogyasri Network Hospitals Association

హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల బృందంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగనున్నాయి. తక్షణమే ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా మంత్రి ఈటల తెలిపారు. ప్రతినెలా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్య శ్రీ ద్వారా లక్షల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.

855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles