వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి

Mon,May 20, 2019 06:50 AM

హైదరాబాద్ : శాంతి భద్రతల విషయంలో 50 ఏండ్లలో ఇతర రాష్ర్టాలు సాధించలేని ప్రగతిని తెలంగాణ పోలీసులు ఐదేండ్లలో సాధించారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ పోలీసులు దేశంలోని ఇతర పట్టణాల పోలీసులకే కాకుండా, ఇతర దేశాల పోలీసులకు కూడా మార్గదర్శకులుగా నిలుస్తున్నారన్నారు.


వచ్చే నెల 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు పూర్తవుతుందన్నారు. మోడ్రన్ టెక్నాలజీతో నేరాలను అదుపు చేసి, శాంతి భద్రతల పరిరక్షణలో ముందున్నామన్నారు. హైదరాబాద్ సురక్షితమైన నగరంగా గుర్తించబడిందని, దీంతో వివిధ దేశాల ఎంబసీల నుంచి హైదరాబాద్ పోలసులకు అభినందనలు అందుతున్నాయన్నారు. నగరంలో ప్రతి ఏడాది క్రైమ్ రేటు తగ్గుతుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు పౌరులంతా సహకరిస్తే ఈ క్రైమ్ మరింత వరకు తగ్గించేందు వీలుంటుందన్నారు. శాంతిభద్రతలు బాగున్నచోటనే వివిధ రంగాలలో ఆయా సంస్థలు పెట్టుబడులు పెడుతాయని, తద్వారా ఆ నగరం, రాష్ట్రం, దేశం అభివృద్ది చెందుతున్నారు.

హైదరాబాద్‌లోని ప్రజలు సెలవుల్లో ఇంటి తాళం వేసే వెళ్తే.. సమాచారాన్ని స్థానిక సెక్టార్ ఎస్సై, బ్లూకోల్ట్స్ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. ఇండ్లలో పనిచేసే వారి పూర్తి వివరాలు యజమానులు తెలుసుకోవాలన్నారు. ఇండ్లలో పనిచేసే వారి గూర్చి ఉచితంగా పోలీసులు వెరిఫికేషన్ చేసి ఇస్తారని, ఇప్పటికే 6 వేల నుంచి 8 వేల మందిని వెరిఫికేషన్ చేశామన్నారు. హాక్ ఐ అనే అప్లికేషన్‌లో ఈ అవకాశం ఉందని, ఇందులో పేర్లు నమోదు చేసుకోవాలని సీపీ సూచించారు. హైదరాబాద్‌లో నేరం చేస్తే ఎవరు కూడా తప్పించుకోలేరని హెచ్చరించారు. నగరంలో కోటి జనాభా ఉందని, అందులో ఒక శాతం కంటే తక్కువగా నేరాలు చేసేవారున్నారని, దీనిని మరింతగా తగ్గించేందుకు కృషిచేస్తున్నామన్నారు. మోడ్రన్ టెక్నాలజీతో ఎలాంటి నేరస్థుడినైనా పట్టుకుంటామన్నారు.

హైదరాబాద్ పోలీసులు పక్క జిల్లాలకే కాకుండా, పక్క రాష్ర్టాలకు కూడా నేరాల నివారణలో సహాయపడుతున్నారన్నారు. ఇటీవల సెంట్రల్ జోన్ పరిధిలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం నడుపుతున్న భర్త హెల్మెట్ పెట్టుకున్నాడు, వెనుక కూర్చున్న భార్య హెల్మెట్ పెట్టుకోలేదు. అనుకోకుండా ప్రమాదం జరగడంతో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకవేళ ఆమెకు హెల్మెట్ ఉంటే, అంత పెద్దగాయాలు జరిగేవి కావు. ప్రతి జీవితం ముఖ్యమే. అందుకే వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ఉండాలి. ప్రతి కుటుంబంలోని పిల్లలు దీనిపై దృష్టి పెట్టాలి. తాము కూడా అవాగాహన తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. వైట్‌నర్ తాగి నేరాల బాటపట్టే వారు నగరంలో ఉన్నారు. దీంతో వైట్‌నర్ విక్రయించే దుకాణాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాం. ఇందుకు ఎస్బీలో ప్రత్యేక విభాగం వైట్‌నర్ అమ్మకాలపై నిఘా పెడుతుంది. ఒక దుకాణం ఎంత వైట్‌నర్ కొన్నది, ఎంత అమ్మింది, అది ఎవరికి అమ్మారు, కోనుగోలుదారులెవరు అనే విషయాలను ఆరా తీస్తుంది అని సీపీ తెలిపారు.

5299
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles