తండ్రులకు కునుకు కరువు

Mon,June 17, 2019 06:39 AM

- పిల్లల చదువుల కోసం త్యాగం
- ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్న వైనం
- వెల్లడించిన సర్వే

హైదరాబాద్: పిల్లల చదువుల కోసం తండ్రులు త్యాగం చేస్తున్నారు. అవును ఫీజులు కట్టేందుకు డబ్బులే కాదు, తమ విలువైన సమయాన్ని త్యాగం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, పునాది సక్రమంగా ఉండాలని భావించి ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. చదువుల కోసం ఏకంగా తండ్రులు నిద్రను మానుకుంటున్నారట.


ప్రత్యేకించి రాత్రిళ్లు రోజుకింత సమయం చొప్పున పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్నారట. విద్యాసంబంధ అంశాల్లో శిక్షణనిచ్చే బ్రేయిన్లీ సంస్థ ఆన్‌లైన్ ద్వారా సర్వేను నిర్వహించి ఆయా వివరాలను వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ పిల్లలకు చదువుల్లో సహాయపడటానికి రాత్రిళ్లు పొద్దుపోయేవరకు మేల్కొంటున్నారని సర్వేలో తేలింది. ఇక 70 శాతం విద్యార్థులు తమ విజయాల్లో తండ్రుల పాత్ర ఉందని వెల్లడించినట్లు బ్రేయిన్లీ సంస్థ సీఈవో మైకెల్ బోర్‌కౌస్కి తెలిపారు.

తండ్రుల మనోగతం


- పిల్లలకు ప్రతీరోజు రాత్రిళ్లు సహాయపడుతున్నామన్న వారు 35 శాతం.
- వారంలో కొన్నిసార్లు ఆలస్యంగా పడుకుంటున్నామన్న వాళ్లు 30 శాతం.
- పిల్లల విద్యపట్ల అత్యంత ఆసక్తి కనబరుస్తున్న తండ్రులు 55 శాతం.
- పుస్తకాలు, నోట్స్‌ను వినియోగించాలని సూచిస్తున్న వారు 45 శాతం.
- ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నామన్నవారు 30 శాతం.
విద్యార్థుల మనోగతం..
- విద్యాసంబంధిత విజయాల్లో తమ తండ్రులు కీలకపాత్ర పోషిస్తున్నారన్న వారు 72 శాతం.
- తమ తండ్రులు కఠిన, క్రమశిక్షణ గలవారని పేర్కొన్న వారు 75 శాతం.
- తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి తండ్రులతో చర్చలు జరుపుతామన్నారు 35 శాతం.

4963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles