ఇక అడవులు తరగవు.. పెరుగుతూనే ఉంటాయి!

Wed,August 14, 2019 09:23 AM

forest cover will  be  increased  in telangana

మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి అడువులు తరగవని, వాటి విస్తీర్ణం, దట్టమైన అడువుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని హైదరాబాద్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు మొక్కల పెంపకం, అడవుల సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాని, ఈ క్రమంలోనే మనుషులు అడుగుపెట్టలేని అడువుల్లో కొత్త మొక్కలను పెంచేందుకు డ్రోన్ సాయంతో భారీ వృక్షాలకు సంబంధించి విత్తనాలను చల్లుతున్నామన్నారు. బుధవారం లాల్‌గడి మలక్‌పేట్‌లోని రిజర్వు ఫారెస్ట్‌లో సుమారు 1.5 కిలోల చింత, మర్రి, రావి విత్తనాలను డ్రోన్ సాయంతో చల్లామని, అలాగే దూలపల్లి ఫారెస్టులో విత్తనాలు చల్లి విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ విత్తనాలు సులభంగానే మొలకెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నగర జీవనంకు సరిపడేలా మొక్కలను నాటి గ్రీనరీని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉన్న చెట్లను కాపాడుతూనే కొత్తగా మొక్కలను పెంచుతున్నామని, సమీప భవిష్యత్‌లోనే తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం క్రమంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజనల్ అధికారిణి శిరీష, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్, ఫారెస్ట్ రేంజ్ అధికారిణి మంజుల, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని డ్రోన్‌తో అడవులలో విత్తనాలు చల్లుతున్న విధానాన్ని తిలకించారు.

1332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles