గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన జీఎంఆర్‌ ఛైర్మన్‌

Mon,August 19, 2019 02:40 PM

Grandhi Mallikarjuna Rao accepts Green Challenge from TRS MP Santosh Kumar

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభమైన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం సంతోష్‌ మొక్కను నాటి సెల్ఫీ దిగి దానిని ట్విటర్లో పెట్టడంతో పాటు మొక్కలు నాటాలంటూ ఎంపీలు విజయ సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, జీఎంఆర్‌ గ్రూపు సంస్థ ఛైర్మన్‌ గ్రంథి మల్లికార్జున రావు, నటుడు అఖిల్‌ అక్కినేనిలకు గ్రీన్‌ ఛాలెంజ్‌ సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. సంతోష్‌ ఇచ్చిన ఛాలెంజ్‌ను తాజాగా జీఎంఆర్‌ అధినేత స్వీకరించారు. ఇవాళ తన నివాసంలో మొక్కను నాటారు. జీఎంఆర్‌ సంస్థ తమ ప్రతీ ప్రాజెక్టులోనూ పచ్చదనం పెంపు కోసం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తెలంగాణకు హరితహారం తనకు ఇష్టమైన కార్యక్రమం అని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మల్లికార్జున రావు ఆకాంక్షించారు.

568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles