'పబ్‌జీ' గేమ్ ఆన్‌లైన్ టోర్నమెంట్‌ను ఆపండి!

Mon,April 22, 2019 07:00 AM

hyd youth  requests police  to block the PUBG  game

హైద‌రాబాద్‌: ఆన్‌లైన్‌లో సోలో పబ్‌జీ గేమ్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నార‌ని.. యువతను ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలు చేస్తున్నారంటూ నగరానికి చెందిన కొందరు యువకులు ఆదివారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేటీఎంలో రూ.30 ఎంట్రీ ఫీజు చెల్లించాలని, ఆ తరువాత ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఈ టోర్నమెంట్‌లో జరిగే గేమ్‌లో ఒకరిని చంపితే రూ.10, చికెన్ డిన్నరతో కొడితే రూ.200 అంటూ నిర్వాహకులు ఆఫర్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ గేమ్‌ను బహిష్కరించి, ఈ నెల 23న జరుగనున్న ఈ ఆన్‌లైన్ టోర్నమెంట్‌ను అడ్డుకోవాలంటూ పోలీసులను కోరారు. సోమవారం పూర్తి వివరాలతో వచ్చి ఉన్నతాధికారులను కలువాలంటూ సైబర్‌క్రైమ్ ఠాణా సిబ్బంది, ఫిర్యాదుదారులకు సూచించారు.

1503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles