వినాయక చవితి.. బాణాసంచాపై నిషేధం

Tue,August 20, 2019 10:29 AM

హైదరాబాద్‌ : నగరంలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై బాణాసంచా కాల్చొద్దని, దీనిపై నిషేధం విధించినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. ఈ నిషేధం 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 12 రాత్రి వరకు అమల్లో ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతియుత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని నగర ప్రజలకు సీపీ అంజనీ కుమార్‌ పిలుపునిచ్చారు.1187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles