ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు

Sun,June 2, 2019 07:11 PM

Iftar feast in lb stadium conducted by telangana government

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ విందుకు సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

విద్యుత్ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా శుద్ధమైన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టాం. మైనార్టీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని సీఎం తెలిపారు.

తెలంగాణను చూసి యావత్ దేశం నేర్చుకుంటోంది


తెలంగాణను చూసి ప్రస్తుతం యావత్ దేశం నేర్చుకునే పరిస్థితి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశాం. రైతులందరూ సంతోషంగా జీవిస్తున్నారు. 23 వేల గ్రామాల్లో నల్లాల ద్వారా నీరు అందివ్వబోతున్నాం. మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాం. మైనార్టీ పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రాజెక్టులన్నీ చకచకా పూర్తి చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.

1287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles