ఉస్మానియాలో తొలిసారిగా.. లేజర్‌తో కిడ్నీలో రాళ్ల తొలిగింపు

Fri,September 7, 2018 12:29 PM

kidney stones removed in osmania hospital with laser technology

హైదరాబాద్: పేదల దవాఖానకు పేరుగాంచిన ఉస్మానియా దవాఖానాలో మొట్టమొదటిసారి కిడ్నీలో రాళ్లను లేజర్ ట్రీట్‌మెంట్‌తో వైద్యులు విజయవంతంగా తొలిగించారు. కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఉస్మానియా వైద్యులు అత్యాధునిక పద్ధతులతో రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా ముగ్గురు రోగులకు ఒకే రోజు కిడ్నీల్లో రాళ్లను తొలిగించి కార్పొరేట్ దవాఖానలకు తామేమి తక్కువకాదని నిరూపించారు.

ఇటీవల దవాఖానలో చేరిన భాస్కర్(10 ఎంఎం), తరియా (9ఎంఎం), శరణప్ప(12ఎంఎం)లకు యూరాలజీ హెచ్‌వోడీ డాక్టర్ రామకృష్ణప్రసాద్ ఓపీలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ముగ్గురికి కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. లేజర్ ట్రీట్‌మెంట్‌తో ఒకేరోజు ముగ్గురికి రాళ్లను తొలిగించారు. ఈ మేరకు ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ రోగులకు లేజర్ ట్రీట్‌మెంట్‌తో విజయవంతంగా రాళ్లను తొలిగించినందుకు యూరాలజీ హెచ్‌వోడీ రామకృష్ణ ప్రసాద్‌ను, వారి బృందాన్ని అభినందించారు.

2665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles