నగరానికి చేరుకున్న వ్యాపారి మృతదేహం

Sun,November 12, 2017 07:22 AM

హైదరాబాద్: మలేషియాలో హత్యకు గురైన నగరానికి చెందిన వ్యాపారి వాసుదేవన్ మృతదేహాం శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది. మలేషియాలో వ్యాపారి రెండు రోజుల క్రితం దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయంలో వాసుదేవన్ మృతదేహాన్ని అధికారులు బంధువులకు అప్పగించారు. కొందరు వ్యక్తులు వ్యాపారం పేరుతో వాసుదేవ్ ను మలేషియా తీసుకెళ్లినట్లుగా అనుమానం. అక్కడికి వెళ్ళాక గదిలో బంధించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ. 3 కోట్లు డిమాండ్ చేశారు. వాసుదేవ్ ను బంధించిన ఫొటోలను వాట్సాప్ లో కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపించారు. సకాలంలో స్పందించలేదనే కారణంతో దుండగులు వాసుదేవ్ ను హతమార్చారు. మృతుడు కుషాయిగూడ మహేష్ నగర్ వాసి.

1648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles