ఆర్టీసీ సమ్మె..ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి అజయ్‌ చర్చలు

Fri,October 4, 2019 06:21 PM

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమ్మె అనివార్యమైతే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్టీసీకి 44శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఏ ప్రభుత్వం కల్పించని విధంగా ఆర్టీసీకి 15శాతం ఐఆర్‌, ప్రతినెల ఆర్టీసీ వారికి అసిస్టెన్స్‌ ఇస్తున్నాం. పక్క రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు పక్క రాష్ట్రంలో లేవు. ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్‌ స్కూల్‌, కాలేజీ, అద్దె బస్సులను ప్రత్యామ్నాయంగా నడిపించాలి. ప్రతీ డిపోకి ఒక పోలీస్‌ అధికారిని నియమించాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు ఛాలెంజ్‌గా తీసుకుని పండుగ సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అధికారులకు' మంత్రి సూచించారు.

1736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles