ఇష్టారాజ్యంగా బీజేపీ నేతలు విమర్శలు చేయడం సరికాదు!

Mon,August 19, 2019 03:42 PM

 Minister  Singireddy Niranjan reddy   releases book on farmers

హైదరాబాద్‌: బేగంపేటలోని హోటల్‌ హరిత ప్లాజాలో 'రైతు మార్గదర్శి' పుస్తకాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్‌ ఛైర్మన్‌ లింగంపల్లి కిషన్‌రావు, ఆగ్రోస్‌ ఎండీ సురేందర్‌, వ్యవ్యసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 'రైతులకు సంబంధించి ఆలోచనలను పుస్తకరూపంలో తీసుకొచ్చిన లింగంపల్లి కిషన్‌రావుకు అభినందనలు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. ఉపాదిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మన ఎంపీలు కోరారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతోనే రైతుబంధు, రైతుబీమా పథకాలు వచ్చాయి. రాష్ట్రపథకాలు అద్భుతమని నీతి ఆయోగ్‌ కితాబు ఇచ్చింది. రాష్ర్టానికి రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సూచించింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లక్షల ఎకరాలకు సాగు నీరందే ప్రాజెక్టు ఎక్కడైనా నిర్మించిందా? కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌ సర్కారుకే దక్కింది. ఇష్టారాజ్యంగా బీజేపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని' నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

943
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles