మెళకువలు తెలియని డ్రైవింగ్

Tue,January 23, 2018 07:19 AM

-వరుస ప్రమాదాలతో ఆందోళన
హైదరాబాద్: వరుసగా జరుగుతున్న ప్రమాదాలు డ్రైవింగ్ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీపై అంతగా వాహన చోదకులకు అవగాహన లేకపోవడమే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డ్రైవింగ్‌లో నిష్ణాతులు కానీ వారు వాహనాలు నడపడం వల్లే అనేకమంది మృత్యువాత పడుతున్నారు. ఈ విషయంలో రవాణాశాఖ కూడా బాధ్యత వహించాల్సి ఉంది. రోడ్డు నిబంధనలు తెలియని వారికి కూడా లైసెన్సులు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతున్నది. ఆరకొర డ్రైవింగ్ వచ్చిన వారికి ఎడా పెడా లైసెన్సులు ఇవ్వడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నది. డ్రైవింగ్ టెస్ట్ సమయంలో ఎలాగోలా మేనేజ్ చేస్తే లైసెన్సు వచ్చేస్తుందనే నమ్మకంతో డ్రైవింగ్‌లో పూర్తిగా నైపుణ్యం పొందకుండానే కార్యాలయాలకు వచ్చి లైసెన్సులు పొందుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్న వారిలో 50 శాతం మందికి రోడ్‌సిగ్నల్స్ మీద అవగాహన ఉండడం లేదు. ఇవి తెలియకుండానే టెస్ట్‌లన్నీ పాసవుతూ లైసెన్సులు పొందుతున్నారు.

ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్ నుంచే
రవాణాశాఖలో జరుగుతున్న డ్రైవింగ్ టెస్ట్‌లన్నీ తూతూ మంత్రంగానే జరుగుతున్నాయి. లెర్నింగ్ లైసెన్సు టెస్ట్ దగ్గరనుంచి శాశ్వత లైసెన్సు పొందే వరకు పరీక్షలన్నీ తూతూ మాత్రంగానే జరుగుతున్నాయి. ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్ దశలోనే లైసెన్సుకు వచ్చిన వారిని జాగ్రత్తగా పరీక్షిస్తే 80 శాతం మందికి లైసెన్సులే రావు. ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్ నుంచే మేనేజ్ చేస్తారు. ఎవరో ఒక బ్రోకర్‌తో రావడం, అడిగినంతా సమర్పించుకోవడంతో ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్ నుంచి గట్టెక్కుతున్నారు. అసలు ఎల్‌ఎల్‌ఆర్ టెస్ట్‌పై ప్రతీ డ్రైవర్‌కు అవగాహన ఉండాల్సిన అవసరముంది. రోడ్ సిగ్నల్స్ పూర్తిగా తెలిస్తే ఇటువంటి ప్రమాదాలు జరుగవు. ఎల్‌ఎల్‌ఆర్‌ను సులువుగా దక్కించుకుంటున్న చాలా మంది అదే తరహాలో బ్రోకర్ల ద్వారా శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్నారు. ఇక వాహనాల ఫిట్‌నెస్ కూడా అంతంత మాత్రమే. కానిస్టేబుళ్లు, హోంగార్డులతోనే ఫిట్‌నెస్ పరీక్షలు చేపిస్తూ అధికారులు దర్జా వెలుగబెడ్తున్నారు.

1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles