దేశంలో ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి!

Sun,August 18, 2019 05:02 PM

PFC chairman  Rajiv Sharma meets  CM KCR in pragathibavan

హైదరాబాద్‌: అన్ని రంగాలకు అన్ని వేళలా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యంగా దేశంలో సమగ్ర విద్యుత్‌ విధానం రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సీఎండీ రాజీవ్‌ శర్మ, జెన్‌కో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరిని సీఎం కేసీఆర్‌ సన్మానించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం అందించినందుకు రాజీవ్‌ శర్మకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.

దేశంలో ప్రస్తుతమున్న స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యంలో సగం కూడా ఉపయోగించుకోవడం లేదని సీఎం కేసీఆర్‌ అధికారులకు వివరించారు. ఇంకా చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఉందని గుర్తుచేశారు. రాష్ట్రప్రగతికి ఆనాడు విద్యుత్‌ సమస్యే తీవ్ర అవరోధంగా నిలిచిందన్నారు. విద్యుత్‌ సమస్య పరిష్కరించనిదే రాష్ట్ర పురోగతి సాధ్యం కాదని భావించామని అన్నారు. విద్యుత్‌ రంగాన్ని తీర్చిదిద్దడానికి సమగ్ర వ్యూహం అనుసరించామన్నారు. ఆరు నెలల్లోనే విద్యుత్‌ కోతలు ఎత్తివేశామని వెల్లడించారు. ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్‌ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించుకున్నామని తెలిపారు. విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి పీఎఫ్‌సీ అందించిన సహకారం దోహదపడిందన్నారు. తెలంగాణ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఎదిగేందుకు పీఎఫ్‌సీ సహకారం ఉపయోగపడిందన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయని ఈ పరిస్థితి పోవాల్సిన అవసరముందని కేసీఆర్‌ పేర్కొన్నారు.

రాజీవ్‌ శర్మ రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గురించి దేశమంతా చెప్పుకుంటున్నారని రాజీవ్‌ శర్మ అన్నారు. న్యూయార్క్‌ టైమ్‌ స్కేర్‌లోనూ కాళేశ్వరం విజయగాథను ప్రదర్శించారని ఆయన తెలిపారు. విద్యుత్‌ రంగంపై సీఎం కేసీఆర్‌కు పూర్తిగా అవగాహన ఉందని ప్రభాకర్‌ రావు చెప్పారు. కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్ల మంచి ఫలితాలొచ్చాయని అన్నారు. విద్యుత్‌ సంక్షోభ పరిష్కారం ఘనత కేసీఆర్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు.

1554
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles