నైపుణ్యంతో కూడిన విద్య ముఖ్యం: వినోద్ కుమార్

Fri,November 15, 2019 08:24 PM

హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన విద్యతోనే విద్యార్థులు జీవితంలో రాణిస్తారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. బంజారాహిల్స్‌లో జరిగిన ఎడ్యూ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కాలేజీల్లో నైపుణ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి కోసం సీఐఐ, ఉన్నత విద్యామండలి కలిసి ప్రత్యేక చొరవ చూపించాలన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు గ్రామీణ విద్యార్థులకు వరంగా మారాయని తెలిపారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు. గత ఏడాదిలో టీఆర్‌ఎస్ సర్కార్ 500 గురుకులాలను ప్రారంభించిందని ఆయన చెప్పారు.

645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles