నా బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే..!

Mon,July 22, 2019 10:47 AM

Rangam Bhavishyavani  At Secunderabad Ujjaini Mahankali

హైదరాబాద్: రాష్ట్రంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయని జోగిని స్వర్ణలత తెలిపారు. బోనాల అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఇవాళ ఉదయం మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ.. నా ప్రజలందరూ సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారు. భక్తుల ముడుపులు సంతోషంగా అందుకున్నాను. వర్షాలు తప్పకుండా కురుస్తాయి. నాకు పూజలెందుకు ఆపుతున్నారు. నాకు బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలి. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నా. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి. అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుంది. ఐదు వారాలపాటు పప్పు, బెల్లంతో శాక‌లు సమర్పించండి. నా బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే. అని స్వర్ణలత చెప్పారు.

5081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles