విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు..

Sun,November 3, 2019 11:44 AM

హైదరాబాద్‌: గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు విధుల్లో చేరేందుకు ఆయా డిపోలకు చేరుకున్నారు. నిన్న(శనివారం) జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు వారు ఉద్యోగంలో చేరేందుకు సన్నద్దమౌతున్నారు. నవంబర్‌ 5 అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరితే, వారి భవిష్యత్‌ బాగుపడుతుందనీ.. అడ్డగోలు యూనియన్ల నిర్ణయాల వల్ల తమ జీవితాల్ని, కుటుంబాల్ని నాశనం చేసుకోవద్దని సీఎం సూచించారు. విధుల్లో చేరకపోతే మళ్లీ తీసుకునేది లేదని ఆయన కరాఖండిగా చెప్పిన విషయం విదితమే.


ఈ విషయాన్ని గ్రహించిన ఉద్యోగులు తమ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నారు. సమ్మతి పత్రాలు ఇచ్చి, విధుల్లో చేరేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రంలోని చాలా బస్‌ డిపోల వద్దకు ఉద్యోగులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భద్రాచలం, ఉప్పల్‌, కామారెడ్డి, హయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌ డిపోల వద్దకు కార్మికులు విధుల్లో చేరేందుకు సన్నద్దమై వచ్చారు. కార్మికులను యూనియన్‌ నాయకులు బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అందుకనుగుణంగా భద్రతా కట్టుదిట్టం చేశారు.





7889
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles