ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుదాం.. దాన కిశోర్

Wed,June 19, 2019 09:24 PM

పేట్‌బషీరాబాద్: కేపీహెచ్‌బీ కాలనీ: ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చుదామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ కమిషనర్ దానకిశోర్ అన్నారు. గాజులరామారం సర్కిల్‌లో పర్యటించారు. సాఫ్ హైదరాబాద్- షాన్‌దార్ హైదరాబాద్ అమలుకు ప్రత్యేక్షంగా తనిఖీ చేశారు. చింతల్ డివిజన్ పరిధిలోని రంగనగర్‌లో మొదటగా పర్యటించారు.ఆయన స్థానికంగా తడి పోడి చెత్తతో వర్మికంపోస్టును ఎలా ఉపయోగిస్తుంన్నారో పరిశీలించారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేసేందుకు తగు స్థలాలకు గుర్తించాలన్నారు. సాఫ్ హైదరాబాద్ షాన్‌దార్ హైదరాబాద్ లొకేషన్‌లలో నిర్థారించి 2500 ఇండ్లలో జూలై వరకు తడి, పోడి చెత్తను వేరువేరుగా చేయడం, స్వచ్ఛ ఆటోల్లో వేయడం పూర్తి చేయలన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్‌లో 300టన్నులకు పైగా ప్లాస్టిక్‌ను సేకరించామన్నారు. ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ కవర్లకు బదులు జ్యుట్ బ్యాగులను వాడలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, ఉప కమిషనర్ రవీంద్ర కుమార్, ఈఈ మహేశ్వర్‌రెడ్డి, వైద్యాధికారి మహిపాల్‌రెడ్డి, డీఈలు శిరీష, లాల్‌సింగ్, జలమండలి అధికారులు అప్పలనాయుడు, భాస్కర్, అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

1015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles