స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

Mon,October 22, 2018 06:38 AM

Slightly grown temperatures in hyderabad

హైదరాబాద్ : ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 26న భారత్‌లో ప్రవేశించే అవకాశమున్నది. తమిళనాడు నుంచి దేశంలోకి ప్రవేశించే ఈ రుతుపవనాలు ఆ తర్వాత రాయలసీమ మీదుగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణపై వీటి ప్రభావం ఉండబోదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. దేశం నుంచి నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి పూర్తిగా నిష్క్రమించినట్టు ఆయన చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. సాధారణస్థాయి కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత 2.1 సెల్సియస్ డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 5.8 డిగ్రీలు ఎక్కువగా నమోదయింది. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు నగరంలో గరిష్ఠంగా 33.1 డిగ్రీలు, కనిష్ఠంగా 22.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

1767
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles