పాము కనబడగానే రైలులో సోదాలు నిర్వహించాం..!

Wed,August 21, 2019 08:00 AM

హైదరాబాద్: మెట్రోరైలులో పాము కనిపించగానే సంబంధిత రైలును ప్రయాణికుల కోసం ఉపయోగించకుండా పక్కకు పెట్టినట్లు మెట్రో రైలును ఆపరేట్ చేస్తున్న ఎల్‌అండ్‌టీ సంస్థ వెల్లడించింది. ఈనెల 14వ తేదీన ఎల్బీనగర్ వద్ద ట్రైన్ సైడింగ్(నాన్ ప్యాసింజర్ ఏరియా)లో పాము కనబడిందని చెప్పారు. పాము కనబడిన దగ్గరనుంచి ఇప్పటివరకు పక్కకు పెట్టి కొద్ది రోజులు రైలును పూర్తిస్థాయిలో తనిఖీ చేశామని పేర్కొన్నారు. చివరకు 19న చిన్న పామును పట్టుకున్నామని తెలిపారు. అయితే పాముతో ఉన్న రైలు 2500 కిలోమీటర్లు ప్రయాణించిందని ప్రచారం జరుగుతుందని ఇది అవాస్తవమని తెలిపారు. డీబీ031 నంబరు రైలులో ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కు బయలుదేరగా దిల్‌సుఖ్‌నగర్ వద్ద పైలట్ డ్యాష్‌బోర్డులో చిన్న పాము కనిపించింది. పైలట్ అప్రమత్తమై ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా పాము కనిపించలేదు. మళ్లీ పాము కనిపించగానే వారికి సమాచారమివ్వగా వచ్చి పామును పట్టుకున్నారు. ప్రమాదకరమైన పాము కాదని స్నేక్ సొసైటీ సభ్యులు తెలిపారు.

960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles