నాలుగు నెలల్లో అందుబాటులోకి అండర్‌పాస్‌లు

Wed,April 24, 2019 01:09 PM

Under Pass ways comes to available in four months says Dana kishore

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ నుంచి బైరామల్‌గూడ మధ్య నిర్మాణంలో ఉన్న అండర్‌పాస్‌ పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. రూ. 42 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్‌ జంక్షన్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎల్బీనగర్‌ అండర్‌పాస్‌ నిర్మాణ పనులకు భూ సేకరణ త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నాలుగు నెలల్లో అండర్‌పాస్‌ పనుల నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా వనస్థలిపురంలో నిర్మాణంలో ఉన్న రెండు పడకగదుల ఇళ్లను దాన కిషోర్‌ పరిశీలించారు.

2328
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles