మీరు కొనే చేపలు తాజాగా ఉన్నాయో లేదో ఇలా గుర్తించవచ్చు..!

Thu,November 23, 2017 10:42 AM

4 tips to identify fresh fishes

చేపలలో మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు దాగి ఉంటాయని అందరికీ తెలిసిందే. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన శరీరంలో కండరాల నిర్మాణానికి, మెదడు ఎదుగుదలకు తోడ్పడుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. చేపలను తినడం వల్ల హై క్వాలిటీ ప్రోటీన్లు మనకు అందుతాయి. దీంతోపాటు ఇంకా ఎన్నో లాభాలు చేపల వల్ల మనకు కలుగుతాయి. అయితే ఇదంతా సరే.. కానీ చేపలను కొనేటప్పుడు మాత్రం చాలా మంది అవి తాజాగా ఉన్నాయా, లేదా అని చూసి మరీ కొంటారు. కొందరు తాజాదనం గుర్తిస్తారు. కొందరు గుర్తించలేరు. అలాంటి వారికోసమే కింద పలు సూచనలు ఇస్తున్నాం. వాటిని గుర్తుంచుకుంటే ఇకపై చేపలను కొనేటప్పుడు అవి తాజాగా ఉన్నాయా, లేదా అనే విషయం ఇట్టే పసిగట్టవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దామా..!

1. తాజా చేపల నుంచి చేపల వాసన తప్ప మరే వాసనా రాదు. అదే ఎక్కువ సేపు ఉంచిన చేపల నుంచి అయితే కుళ్లిన వాసన వస్తుంటుంది. దీన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. చేపల వాసన కాకుండా మరే ఇతర వాసన వచ్చినా ఆ చేపలు తాజాగా లేవనే విషయం గుర్తుంచుకోవాలి.

2. తాజా చేపల కళ్లు పెద్దగా, ఉబ్బుగా, ప్రకాశవంతంగా ఉంటాయి. అదే ఎక్కువ సేపటి నుంచి ఉన్న చేపల కళ్లు అయితే లోపలికి కుచించుకుపోయినట్టు ఉంటాయి. తలలోకి వెళ్తాయి.

3. చేపల మొప్పలు బ్రైట్ పింక్ లేదా రెడ్ కలర్‌లో ఉంటే అవి తాజాగా పట్టినవి అని తెలుసుకోవాలి. అలా కాకుండా మొప్పలు మిగిలిన ఏ కలర్‌లో ఉన్నా అవి తాజా చేపలు కావని గుర్తించాలి. ఇక ఆ మొప్పలు తడిగా ఉంటే తాజా చేపలని, అలా కాకుండా పొడిగా ఉంటే తాజా చేపలు కావని తెలుసుకోవాలి.

4. ఎక్కువ సేపు ఉంచిన చేపల చర్మం అయితే పొడిగా మారుతుంది. పొలుసులుగా ఊడిపోతుంది. అదే తాజా చేపల చర్మం స్మూత్‌గా ఉంటుంది. వేలితో నొక్కితే రబ్బర్ లా ఉండి వేలిని వెనక్కి నెడుతుంది.

8935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles