మెగా హీరో 'ఇంటిలిజెంట్‌'గానే వ‌స్తున్నాడ‌ట‌

Fri,January 5, 2018 09:23 AM

Intelligent Movie release date fixed

వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం వివి వినాయ‌క్ తో పాటు క‌రుణాక‌ర‌ణ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం మ‌స్క‌ట్ షెడ్యూల్ పూర్తైన‌ట్టు తెలుస్తుంది. మ‌రో రెండు పాట‌లు బ్యాలెన్స్ ఉండ‌గా, జ‌న‌వ‌రి 17 వ‌ర‌కు షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఫిబ్ర‌వ‌రి 9న చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం ధ‌ర్మ‌బాయ్, దుర్గా వంటి టైటిల్స్‌తో ప్ర‌చారం జ‌ర‌గ‌గా, చివ‌రికి ఇంటెలిజెంట్ అనే టైటిల్‌ని కన్‌ఫర్మ్‌ చేశారు. తేజూ కెరీర్‌లో ఈ చిత్రం మైల్ స్టోన్‌గా నిలుస్తుందని నిర్మాత‌లు అంటున్నారు. లావ‌ణ్య త్రిపాఠి ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. తమన్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుందని స‌మాచారం.

1218
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles