ఆఫ్ఘన్‌లో దాడి.. 14 మంది పోలీసులు మృతి

Tue,May 22, 2018 11:13 AM

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు ఘజని ప్రావిన్సులోని పలు జిల్లాలో జరిగిన తాలిబన్ దాడుల్లో 14 మంది పోలీసు ఆఫీసర్లు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. దిక్ యాక్ జిల్లాలోనే ఏడు మంది పోలీసులు మృతిచెందినట్లు ఆ ప్రావిన్సు మంత్రి హసన్ రెజా తెలిపారు. ఆ దాడిలో పోలీస్ చీఫ్‌తో పాటు రిజర్వ్ పోలీస్ కమాండర్ చనిపోయారు. జగాతూ జిల్లాలో మరో ఏడు మంది పోలీసులు మృతువాతపడ్డారు. ఘజని ప్రావిన్సులోని దిక్ యాక్, జగాతూ జిల్లాల్లో ఉన్న అనేక చెక్‌పాయింట్లపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ దాడుల్లో సుమారు 20 మంది గాయపడ్డారు.

368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles