చెక్‌పాయింట్ వ‌ద్ద కాల్పులు.. 15 మంది మృతి

Wed,November 6, 2019 03:39 PM

హైద‌రాబాద్‌: థాయిలాండ్‌లో వేర్పాటువాదులు బీభ‌త్సం సృష్టించారు. ఓ సెక్యూర్టీ పాయింట్ వ‌ద్ద కాల్పులు జ‌ర‌ప‌డంతో.. సుమారు 15 మంది చ‌నిపోయారు. యాలా ప్రావిన్సులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో చాలా వ‌ర‌కు పోలీసులు హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. 2004లో స‌ద‌ర‌న్ థాయిలాండ్‌లో వేర్పాటువాద ఉద్య‌మం ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి అక్క‌డ జ‌రుగుతున్న దాడుల్లో వేలాది మంది మ‌ర‌ణించారు. చెక్ పాయింట్ వ‌ద్ద జ‌రిగిన కాల్పుల్లో చ‌నిపోయిన‌వారిలో ఓ పోలీసు ఆఫీస‌ర్‌తో పాటు గ్రామీణ డిఫెన్స్ వాలెంటీర్లు ఉన్నారు.

820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles