భారతీయ అమెరికన్‌కు 16 లక్షల డాలర్లు మంజూరు

Wed,May 9, 2018 07:31 AM

16 million dollars granted to Indian American

హూస్టన్: ఊబకాయం కారణంగా మూత్రపిండాల్లో వచ్చే దీర్ఘకాలిక వ్యాధిని నివారించేందుకుగాను మూత్రపిండాల కణాలపై పరిశోధన జరుపుతున్న ఓ భారతీయ అమెరికన్ ప్రొఫెసర్‌కు అమెరికా ప్రభుత్వం 16 లక్షల డాలర్లు మంజూరు చేసింది. హూస్టన్ యూనివర్సిటీలో ఫార్మాకాలజీ ప్రొఫెసర్‌గా తాహిర్ హుస్సేన్ పనిచేస్తున్నారు. కిడ్నీలో ఉండే కణాలు ఏంజియోటెన్సిన్ టైప్2 అనే ప్రొటీన్‌ను విడుదల చేస్తాయని, అవి మంటను నివారించే ప్రభావాన్ని కలిగి ఉంటాయని తాహిర్ హుస్సేన్ వివరించారు. వాటిని ఉత్తేజితం చేయగలిగితే మూత్రపిండాల్లో మంట వల్ల వచ్చే దీర్ఘకాల వ్యాధుల నుంచి రోగులను కాపాడవచ్చని అన్నారు.

1681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles